Current Affairs Telugu Daily

జూపిటర్‌ అయస్కాంత క్షేత్రంలో మార్పుల గుర్తింపు
*జూపిటర్‌ అంతర్గత అయస్కాంత క్షేత్రం కాలక్రమంలో మార్పులకు లోనవుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక గుర్తించింది.
*భూమికి వెలుపల ఈ తరహా కీలక అంశాన్ని గుర్తించడం ఇదే తొలిసారి.
* సెక్యులర్‌ వేరియేషన్‌గా పిలిచే ఈ కీలకాంశాన్ని జూపిటర్‌ చుట్టూ తిరుగుతున్న నాసా జునో వ్యోమనౌక గుర్తించింది.
* జూపిటర్‌లోని వాతావరణ గాలుల కారణంగా ఈ తరహా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇవి గ్రహం ఉపరితలం నుంచి 3 వేల కి.మీ. లోతులదాకా విస్తరించినట్లు చెబుతున్నారు.
*ఈ అధ్యయనం వల్ల జూపిటర్‌ అంతర్గత నిర్మాణాన్ని, భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులను మరింత మెరుగ్గా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

views: 751Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams