Current Affairs Telugu Daily

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
*భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మే 22న  సూపర్‌ సోనిక్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
*గగనతలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణిని సు-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి పరీక్షించారు.
*2.5 టన్నుల బరువుండే గగనతలం నుంచి నేలపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణి 300 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగలుగుంది.
*ఇది శబ్దంకన్నా మూడురెట్లు ఎక్కువ వేగంతో పయనిస్తుంది.
*ఈ క్షిపణి ఐఏఎఫ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. యుద్ధవిమానం ద్వారా క్షిపణి పరీక్ష సాఫీగా సాగిందని, నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి అనుపమ్‌ బెనర్జీ వెల్లడించారు.
*2017 నవంబర్‌ 22న ఈ తరహా విభాగంలోని క్షిపణితో గగనతలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ద్వారా ప్రపంచంలోనే తొలి వైమానిక దళంగా ఐఏఎఫ్‌ పేరొందింది. తాజా పరీక్ష రెండోది

views: 668

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams