Current Affairs Telugu Daily

నింగిలోకి  పీఎస్‌ఎల్‌వీ-సీ46

*భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి వెళ్ళింది .
*615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. 
*దీంతో పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. 
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ మే 21న   ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. *25 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసిన అనంతరం మే 22న  ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి ప్రయోగించారు .
*రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది.
* అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 కాలపరిమితి ఐదేళ్లు.
*ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది.
*సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది.  *వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది.
*మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది.  

*పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ.
*పీఎస్‌ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. *చారిత్రకమైన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని జులై 9-16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు. *చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబరులో చంద్రుడిపై కాలుమోపుతామని అంచనావేస్తున్నట్లు చెప్పారు.
*ఆతర్వాత హైరెజెల్యూషన్‌ కాటో 3 ఉపగ్రహం సహా మరికొన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని శివన్‌ తెలిపారు.


views: 845

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams