Current Affairs Telugu Daily

కిర్గిజ్‌ మంత్రితో సుష్మా స్వరాజ్‌ భేటీ
*విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌.. కిర్గిజ్‌ విదేశీ వ్యవహారాల మంత్రి చింగిజ్‌ అయిదర్‌బెకోవ్‌తో మే 21న  సమావేశమయ్యారు.
*కిర్గిజ్‌ రాజధాని బిష్కెక్‌లో రెండు రోజులపాటు జరగనున్న షాంగై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) విదేశీ మంత్రుల సమావేశం కోసం సుష్మా మే 21న  ఉదయం అక్కడికి చేరుకున్నారు.
*ఆమెకు కిర్గిజ్‌ విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికింది.
*చింగిజ్‌తో భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై అర్ధవంతమైన చర్చ జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ చెప్పారు.
*రాజకీయ, రక్షణ, వ్యాపార, ఆరోగ్య, పెట్టుబడి రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలపై మంత్రులిద్దరూ చర్చించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

President    Sooronbay Jeenbekov
Prime Minister    Muhammetkaliy Abulgaziyev
Capital: Bishkek
Currency: Kyrgyzstani som

views: 728



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams