Current Affairs Telugu Daily

‘కిలోగ్రాము’కు మార్పులు
*కిలోగ్రాముకు గ్రాములెన్ని?. వెయ్యి అని చాలామందికి తెలుసు. 
* ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలు నిర్దేశించారు.
*60 దేశాలకు చెందిన ప్రతినిధులు.. బరువులు, కొలతలపై నవంబరు 16, 2018న పారిస్‌లో సమావేశమై ఓ తీర్మానం చేశారు.
*కిలోగ్రాము, కెల్విన్‌, మోల్‌, ఆంపియర్‌ యూనిట్ల కొలతల్లో మార్పులు చేశారు.
*మనదేశం కూడా ఈ కొత్త ప్రామాణికాలను అనుసరించడానికి నిర్ణయించింది.
*ఇప్పటికే ఈ కొత్త ప్రామాణికాలు ప్రపంచ వాతావారణశాస్త్రం దినమైన మే 20 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని ‘సీఎస్‌ఐఆర్‌’ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మండే తెలిపారు. *1889 నుంచి వందకుపైగా దేశాలు మెట్రిక్‌ వ్యవస్థ(ఎస్‌ఐ)ను అనుసరిస్తున్నాయని చెప్పారు. *సెకండ్‌, మీటరు, క్యాండిలా అనే మరో మూడు ప్రాథమిక యూనిట్లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.
*యూనిట్లలో స్వల్ప మార్పులు చేయడం వల్ల మన దైనందిన జీవితాల్లో గొప్ప తేడాలు రాకపోవచ్చని, కాకపోతే వజ్రాల తూకాల్లో ఎంతో మార్పులకు కారణమవుతుందని నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ డైరెక్టర్‌ కె.అస్వాల్‌ తెలిపారు.
*కొత్త యూనిట్లలో మార్పుల గురించి టెక్స్ట్‌ పుస్తకాల్లో మార్పులు చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్‌సీఈఆర్‌టీ, ఏఐసీటీఈ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర విద్యా సంస్థలకు విజ్ఞాపనలు పంపామన్నారు.

views: 861

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams