Current Affairs Telugu Daily


రూపాయికే అంత్యక్రియలు
*ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌.
*మరో పథకానికి ముందడుగు వేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు.
* ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు.
* వచ్చే 15లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
*నగర పాలక ద్వారా రూ.1.10కోట్లు కేటాయించామని, రూ.50లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని చెప్పారు.
* చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams