Current Affairs Telugu Daily

ఫ్లైట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించిన అమెజాన్‌
*ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ సరికొత్త సేవలను భారత్‌లో ప్రారంభించింది.
*ఇక నుంచి అమెజాన్‌ దేశీయ విమాన టికెట్లను బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించింది.
*ఇప్పటికే షాపింగ్‌, నగదు బదలాయింపు, బిల్లుల చెల్లింపు, మొబైల్‌ రీఛార్జి వంటి సేవలను అమెజాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.
*దీనిలో బుక్‌ చేసుకొన్న టికెట్లను రద్దు చేస్తే అదనంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని అమెజాన్‌ పేర్కొంది.
* కేవలం విమానయాన సంస్థ విధించే పెనాల్టీలు మాత్రం చెల్లిస్తే చాలని తెలిపింది. 
*సరికొత్త సేవలను ‘క్లియర్‌ట్రిప్‌’ సంస్థతో కలిసి అమెజాన్‌ యాప్‌లో ప్రారంభించారు.
*‘‘మేము క్లియర్‌ ట్రిప్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాము.
*అమెజాన్‌ యాప్‌ వినియోగదారులకు, ప్రైమ్‌ సభ్యత్వం తీసుకొన్నవారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ’’ అమెజాన్‌ పే డైరెక్టర్‌ షరీక్‌ తెలిపారు

views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams