Current Affairs Telugu Daily

పాక్‌ అరేబియా సముద్రంలో లభించని చమురు నిల్వలు
*అరేబియా సముద్రంలో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయని ఆశించిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు నిరాశే ఎదురయింది.
*కరాచీ తీరానికి 280 కి.మీ.దూరంలోని కేక్రా-1 వద్ద జరిపిన తవ్వకాల్లో ఎలాంటి చమురు, సహజవాయువు లభ్యంకాలేదని వెల్లడయింది.
*5,660 మీటర్ల లోతులో తవ్వినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించారు.
*ఇందుకు సమారు 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) ఖర్చయింది.
*ఇక్కడ చమురు లభిస్తే దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదని, ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని ఇమ్రాన్‌ ఎంతో ఆశపడ్డారు.
*భారత్‌కు చెందిన బాంబే హై మాదిరిగానే ఇక్కడ కూడా ముడిచమురు దొరుకుతుందని సర్వేయర్లు తొలుత అంచనా వేశారు

views: 779Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams