Current Affairs Telugu Daily

ప్రజల దగ్గరకే బ్యాంకింగ్‌ సేవలు : ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ సన్నాహాలు
*బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లని ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది.
*ఇందులో భాగంగా కిరాణా షాపులు, స్టేషనరీ మార్ట్‌లు, మొబైల్‌ రిపేర్‌ కేంద్రాలనే ‘బ్యాంకింగ్‌ పాయింట్లు’ గా మార్చుకుంటోంది.
*‘గల్లీ గల్లీ ఫినో’ అనే పేరుతో బ్యాంకింగ్‌ సేవలను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ విక్రయాల విభాగం అధిపతి శైలేష్‌ పాండే మే 17 న   తెలిపారు.
*పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజలు తమ పనులు మానుకొని బ్యాంకులకు వెళ్లలేరని, అంత సమయాన్ని వెచ్చించలేరని... అటువంటి వారి కోసం వారి దగ్గరకే తాము వెళ్తున్నామని పేర్కొన్నారు.
* ‘మర్చంట్‌ పాయింట్స్‌ నెట్‌వర్క్‌’ ను రూపొందిస్తున్నామని తెలిపారు.
*ఈ ‘మర్చంట్‌ పాయింట్స్‌’ ప్రజలకు అన్ని వేళల్లో సేవలు అందించటానికి సిద్ధంగా ఉంటాయన్నారు. ‘
*మైక్రో ఏటీఎం’ తరహాలో ఈ కేంద్రాల్లో సేవలు పొందవచ్చని, సెలవు రోజుల్లోనూ లావాదేవీలు నిర్వహించవచ్చని అన్నారు.
*‘ఆథార్‌’ దృవీకరణతో నగదు లావాదేవీలు చేపట్టవచ్చని తెలిపారు.
*తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే 8,000 మర్చంట్‌ పాయింట్స్‌ నెలకొల్పినట్లు వెల్లడించారు. 
* హైదరాబాద్‌ నగరంలోనే 900 మర్చంట్‌ పాయింట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

views: 810

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams