Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఎఫ్5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎఫ్5 హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఎఫ్5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సంస్థ అధ్యక్షుడు, సీఈవో ఫ్రాంకోయిస్ లాకో డ్యూనో, ఇండియా ఉపాధ్యక్షుడు రవి కాశీనాథుని, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కారా స్ప్రాగ్, రాష్ట్ర ప్రభుత్వ సీఆర్‌వో అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి కలిసి ప్రారంభించారు.
*ప్రపంచవ్యాప్త విస్తరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావించి హైదరాబాద్‌ను సరైన కేంద్రంగా ఎంచుకొన్నామన్నారు. ప్రభుత్వ ఉత్తమ పారిశ్రామిక విధానం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న ఉత్తమ మానవవనరుల వల్ల హైదరాబాద్ సరైన కేంద్రంగా భావించినట్టు చెప్పారు.
ప్రస్తుతం 240 మంది ఉద్యోగులతో ఈ సెంటర్ ప్రా రంభమవుతున్నదని, రానున్న రెండేండ్లలో 400 మంది ఉద్యోగులకు విస్తరించనున్నట్టు ప్రకటించారు. 

views: 862

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams