Current Affairs Telugu Daily

కరీబియన్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్‌

భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాడు.
*ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకూ భారత్‌ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్‌లో ఆడలేదు.
*పఠాన్‌తో పాటు ఈ లీగ్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌, ఐపీఎల్‌ స్టార్స్‌ రషీద్‌ఖాన్‌, షకిబుల్‌ హాసన్‌, జొఫ్రా ఆర్చర్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జేపీ డుమినీ కూడా తమ పేర్లను సమర్పించారు.
*సెప్టెంబర్‌ 4 నుంచి అక్టోబర్‌ 12 వరకూ జరగనున్న ఈ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారని సీపీఎల్‌ తన అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది. 
*2018లో ఈ కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ట్రిబాగో నైట్‌ రైడర్స్‌ విజేతగా నిలిచింది.


views: 885

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams