Current Affairs Telugu Daily

మిలియనీర్లను కోల్పోవడంలో మన దేశం మూడో ర్యాంకు

తాజా నివేదిక ధనవంతులు దేశం వీడి వెళుతున్నారని హెచ్చరిస్తోంది. గతేడాదిలో భారత్‌ నుంచి 5000 మంది మిలియనీర్లు(సంపన్నులు) దేశం వదిలి వెళ్లారు. మొత్తం సంపన్నుల్లో వీరి సంఖ్య 2 శాతానికి సమానం.
*ఇలా దేశం వదిలి వెళ్లిన మిలియనీర్ల సంఖ్య విషయంలో భారత్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆఫ్రాసియా బ్యాంక్‌, పరిశోధక సంస్థ న్యూ వరల్డ్‌ వెల్త్‌లు రూపొందించిన గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ(జీడబ్ల్యూఎమ్‌ఆర్‌)-2019 నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
*చైనా, రష్యాలు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
* అమెరికా, ఆస్ట్రేలియాలకు ఈ కుబేరులు ఎక్కువగా వలస వెళుతుండడం గమనార్హం.

2028 కల్లా నాలుగో సంపన్న దేశం మనదే..
వచ్చే పదేళ్లలో భారత మొత్తం సంపద ఆకర్షణీయంగా పెరగనుంది. బ్రిటన్‌, జర్మనీలను తోసిరాజని 2028 కల్లా నాలుగో అత్యంత సంపద దేశంగా మారవచ్చ’ని ఆ నివేదిక వెల్లడించింది.

ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌!: వచ్చే పదేళ్లలో ఈ సంపద సృష్టికి దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు కీలకంగా మారనున్నాయని ఆ నివేదిక చెబుతోంది. దిల్లీలో కీలక రంగాల్లో గణనీయ వృద్ధి కనిపించగలదని.. ఇక ఐటీ, ఆర్‌ అండ్‌ డీల్లో బెంగళూరు; ఔషధ రాజధానిగా హైదరాబాద్‌ వెలుగుతాయని అంచనా కట్టింది.


views: 824Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams