Current Affairs Telugu Daily

రష్యా విద్యాసంస్థతో భారత్‌ వర్సిటీ ఒప్పందం
విద్యా బంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యాకు చెందిన యూరల్‌ ఫెడరల్‌ యూనివర్సిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తమిళనాడులోని భారత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (బీఐహెచ్‌ఈఆర్‌-భారత్‌ యూనివర్సిటీ) పునరుద్ధరించింది.
*రష్యాలోని యెకతెరిన్‌బర్గ్‌ నగరంలో యూరల్‌ ప్రాంగణంలో ఇటీవల దీనిపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒప్పందంపై బీఐహెచ్‌ఈఆర్‌ అదనపు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌, యూరల్‌ విద్యా వ్యవహారాల వైస్‌-రెక్టార్‌ సెర్గీ న్యాజెవ్‌ సంతకాలు చేశారు.
*రెండు విద్యా సంస్థల మధ్య పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధిలో బంధాల బలోపేతంతో పాటు విద్యా ప్రచురణలు, సదస్సులు, కార్యశాలల నిర్వహణకూ తాజా ఒప్పందం ఉపకరిస్తుందని బీఐహెచ్‌ఈఆర్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ వి.కానాగ్‌సబాయి తెలిపారు.
Russia::
  • Capital: Moscow
  • Currency: Russian ruble
  • President: Vladimir Putin

views: 733

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams