Current Affairs Telugu Daily

డేటా ప్రైవసీకి జర్మనీలో గూగుల్‌ సెంటర్‌

డేటా గోప్యత కోసం జర్మనీలోని మునిచ్‌లో గూగుల్‌ ప్రైవసీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.
జర్మనీలో దక్షిణ భాగంలో ఉన్న మునిచ్‌ నగరం దీనికి అనువుగా ఉండడంతో అక్కడే ఏర్పాటు చేశామన్నారు. 2019 చివరి నాటికి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను రెట్టింపు చేస్తామని, 200 మందికి పైగా డేటా ప్రైవసీ ఇంజినీర్లు అక్కడి నుంచే సేవలందిస్తారని తెలిపారు. మునిచ్‌ ఇంజినీర్లు గూగుల్‌ అకౌంట్‌ కంట్రోల్‌ ప్యానెల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వెబ్‌ బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌కు అవసరమైన ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తమ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
Google:

  • CEO: Sundar Pichai (2 Oct 2015–)
  • Founded: 4 September 1998, Menlo Park, California, United States
  • Parent organization: Alphabet Inc. 
  • Founders: Larry Page, Sergey Brin

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams