Current Affairs Telugu Daily

చంద్రుడిపై మహిళను దించే ‘ఆర్టెమిస్‌’
*చంద్రుడిపైన మహిళా వ్యోమగామిని దించేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష సంస్థ ‘ఆర్టెమిస్‌’ అని పేరు పెట్టింది.
*2024లో చేపట్టదలచిన ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం ఆ సంస్థ ఇంకా నిధుల వేటలో ఉంది.
*వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2028లో సాకారం చేయాలని నాసా అనుకుంది.
*అయితే ఈ ఏడాది మార్చిలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దాన్ని నాలుగేళ్ల ముందుకు జరిపింది. ఈ గడువును అందుకోవడానికి తమకు కొన్ని మౌలిక వసతులు, అంతరిక్ష వాహనాలు కావాలని నాసా అధిపతి జిమ్‌ బ్రైడెన్‌స్టైన్‌ తెలిపారు.
*గ్రీక్‌ పురాణాల్లో చందమామ దేవత అయిన ఆర్టెమిస్‌ పేరును ఈ ప్రాజెక్టుకు ఖరారుచేశారు. *ఆర్టెమిస్‌.. అపోలోకు కవల సోదరి. అపోలో పేరిట 1969 నుంచి 1972 మధ్య కాలంలో 12 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి మీదకు పంపింది

views: 817

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams