Current Affairs Telugu Daily

ఫిజి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌
*సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌కు అరుదైన గౌరవం లభించింది. *నాన్‌ రెసిడెంట్‌ ప్యానెల్‌లో భాగంగా మూడేళ్లపాటు ఆయనను ఫిజి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే), సుప్రీంకోర్టు అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు.
*గతేడాది తాను పదవీ విరమణ పొందే సమయానికే అప్పటి ఫిజి సీజే జస్టిస్‌ ఆంటోనీ గేట్స్‌ నుంచి తనకు ఈ మేరకు ఆహ్వానం అందిందని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ తెలిపారు.  ఫిజి *సుప్రీంకోర్టులో ఏటా మూడు సెషన్లు ఉంటాయి.
*రానున్న ఆగస్టు సెషన్‌ (ఆగస్టు 15 నుంచి 30 వరకు) నుంచి లోకూర్‌ ఆ దేశ సుప్రీంకోర్టు వ్యవహారాల్లో పాలుపంచుకోనున్నారు.
*ఇతర దేశాల న్యాయమూర్తులతో కలసి పనిచేయనుండటం తననెంతో ఉద్వేగానికి గురిచేస్తోందని జస్టిస్‌ లోకూర్‌ తెలిపారు.
*గతేడాది డిసెంబరు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు

views: 759

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams