Current Affairs Telugu Daily

ఐటీసీ సీఎండీ గా సంజీవ్‌పురి
*ఐటీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) సంజీవ్‌పురి ఇక నుంచి ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
*రెండు దశాబ్దాల పాటు ఛైర్మన్‌, సీఈఓగా ఉండి, 2017 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన  వై.సి.దేవేశ్వర్‌ శనివారం మరణించిన నేపథ్యంలో సంజీవ్‌ పురికి ఛైర్మన్‌గా పదోన్నతి కల్పిస్తూ ఐటీసీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ‘
*సోమవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశమై ప్రస్తుత ఎండీ సంజీవ్‌పురిని ఛైర్మన్‌గా నియమించింది.
*2019 మే 13 నుంచే ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.
* తాజా నియామకంతో ఆయనకు ఛైర్మన్‌- ఎండీగా (సీఎండీ) కొత్త హోదా లభించింద’ని ఎక్స్ఛేంజీలకు ఐటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
*2017లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో), ఛైర్మన్‌ పదవులను ఐటీసీ విభజించింది.
* ఆ సమయంలోనే సీఈఓ పదవి నుంచి దేవేశ్వర్‌ వైదొలిగారు. అయితే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కొనసాగారు. అప్పుడే సంజీవ్‌పురిని ఎండీగా నియమించారు.

views: 718



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams