Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిః 15న జస్టిస్‌ శ్రీదేవి బాధ్యతల స్వీకరణ
*తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి ఈ నెల 15న ఉదయం 10 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
*అలహాబాద్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వస్తున్నారు.
*ఈ నెల 15న మొదటి కోర్టు హాలులో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ఆమెతో ప్రమాణం చేయించనున్నారని .
*ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్‌ శ్రీదేవి అఖిల భారత కోటాలో ఉత్తరప్రదేశ్‌ జ్యుడిషియల్‌ సర్వీసుకు ఎంపికై అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు.

views: 690



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams