Current Affairs Telugu Daily

హిమాచల్‌ సీజేగా జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌
 *తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.
*హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పేరును ప్రతిపాదించింది.
*ఈ మేరకు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
*జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ 1958 జూన్‌ 30న జన్మించారు.
*మద్రాసు వివేకానంద కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన 1983 ఫిబ్రవరి 10న మద్రాస్‌ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు.
*మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆయన సీనియర్‌ న్యాయవాదులు కె.సార్వభౌమన్‌, టి.ఆర్‌.మణిల వద్ద జూనియర్‌గా మెలకువలు నేర్చుకున్నారు.
*2006 జులై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన రామసుబ్రమణియన్‌ 2009 నవంబరు 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. *మద్రాసు నుంచి బదిలీపై వచ్చిన ఆయన 2016 ఏప్రిల్‌లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
*2019 జనవరిలో హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

views: 775

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams