Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ 
*తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 
*రాజస్థాన్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
*జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ 1959 డిసెంబరు 24న జన్మించారు.
* అమెరికాలోని ఆర్కాడియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన ఆయన 1983లో దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
*అదే ఏడాది నవంబరు 13న రాజస్థాన్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు.
*1986 నుంచి జూన్‌ 2005 వరకు రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు.
*క్రిమినల్‌, రాజ్యాంగంతోపాటు సర్వీసుకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు.  *2005 జూన్‌ 13న రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
*2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వచ్చారు.
* అక్కడి నుంచి గత ఏడాది నవంబరు 23న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
*జనవరి 2019 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
*ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతాకు బదిలీపై వెళ్లడంతో అప్పటి నుంచి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
*తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కూడా ఆయన సామాజిక అంశాల్లో చురుకైన పాత్ర పోషించారు.
*నగరంలో చెరువుల పరిరక్షణ, మూసీ సుందరీకరణలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
*బలహీన వర్గాల కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి మానవీయతను చాటుకున్నారు

views: 854

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams