Current Affairs Telugu Daily

బ్రిటన్‌ కుబేరుల్లో హిందూజాలకు అగ్రస్థానం

యూకేలో అత్యంత సంపన్నమైన వ్యక్తులుగా హిందుజా సోదరులు నిలిచారు.  
*సండే టైమ్స్‌ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో వీరు తొలిస్థానంలో నిలిచారు.
*గత ఏడాదితో పోలిస్తే శ్రీ, గోపి హిందుజాల సంపద 1.356 బిలియన్‌ డాలర్లు పెరిగి 22 బిలియన్‌ డాలర్లకు చేరింది.
*గత ఏడాడి ఈ జాబితాలో టాప్‌గా నిలిచిన రసాయన రంగ సర్‌ జిమ్‌రాట్‌క్లిఫ్‌ ఈ సారి మూడో స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది.
*ఈ జాబితాలో స్థానం సాధించిన తొలి నల్లజాతి మహిళగా వలేరి మోరన్‌  నిలిచారు. 
*1914లో హిందుజాలు ముంబయిలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
*ప్రస్తుతం వారు చమురు, గ్యాస్‌, బ్యాంకింగ్‌, ఐటీ, స్థిరాస్థి రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
*ప్రస్తుతం శ్రీ వయస్సు 83 కాగా, గోపి వయస్సు 79. 

*గతంలో 2014, 17లలో కూడా సండే టైమ్స్‌ జాబితాలో వీరు స్థానం సంపాదించారు.
*యూరప్‌లోని దాదాపు 1000 మంది సంపన్నులను విశ్లేషించి ఈ జాబితాను తయారు చేశారు. బ్యాంక్‌ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను మాత్రం లెక్కలోకి తీసుకోరు.
*హిందుజా ఆటోమోటీవ్‌కు లాభాలు రావడం,  నార్త్‌యార్క్‌షైర్‌ బస్‌ తయరీ సంస్థ ఒపెట్రె లాభాలు కూడా 50శాతం పెరిగాయి.  
*భారతీయ మూలాలు కలిగిన మరో కుబేరుడు లక్ష్మీనివాస్‌ మిత్తల్‌ సంపద విలువ 3.99 బిలియన్‌ పౌండ్లు తగ్గి, 10.66 బి.పౌండ్లకు పరిమితం కావడంతో, ఈయన స్థానం 5 నుంచి 11కు తగ్గింది.
*ఇదే సమయంలో అనిల్‌ అగర్వాల్‌ సంపద విలువ 8.72 బి.పౌండ్లు పెరిగి 10.57 బి.పౌండ్లకు చేరడంతో, 12వ స్థానం దక్కించుకున్నారు
Hinduja Group: 

  • Founder: Parmanand Hinduja
  • Founded: 1914
  • Headquarters: London, United Kingdom

views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams