Current Affairs Telugu Daily

ప్రీ పెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకు డిస్కంల కసరత్తు.

రెండు డిస్కంల పరిధిలో జూన్‌ నుంచి ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ మీటర్ల ద్వారా కరెంటు బిల్లుల వసూలుకు శ్రీకారం చుట్టబోతున్నాయి.
*ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 19వేల ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేశారు.
*ఇవి కాకుండా నెలకు 500 యూనిట్లకు పైగా వాడే వినియోగదారుల కనెక్షన్లకు సైతం లక్షకుపైగా మీటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
*ఈ మేరకు ‘ఇంధన నిర్వహణ సేవల సంస్థ’ (ఈఈఎస్‌ఎల్‌)తో ఉత్తర తెలంగాణ డిస్కం ఒప్పందం చేసుకుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65వేల కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయాలన్నది ఈ ఒప్పంద సారాంశం.
*దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలోనూ 500 యూనిట్లకు పైగా వాడేవారికి ఈ మీటర్లను బిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
డిస్కం:
తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ః

  • TSSPDCL:Telangana State Southern Power Distribution Company Limited 
  • TSNPDC:Telangana State Northern Power Distribution Company Limited 

views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams