Current Affairs Telugu Daily

అడవులపై గగనతల నిఘా డ్రోన్లు వాడే యోచనలో తెలంగాణలో అటవీ శాఖ
*తెలంగాణలో అటవీ సంపద పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఆ దిశగా కృషి  సాగిస్తున్న అటవీశాఖ.. కవ్వాల్‌, అమ్రాబాద్‌ పెద్ద పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు టేకు చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో గగనతల నిఘాపై దృష్టి పెట్టింది.
* వారం లేదా పది రోజుల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
* రూ.కోట్ల విలువైన టేకును, కలపను స్మగ్లర్లు తరలించారు.
* విలువైన వృక్షాల నరికివేత, వన్యప్రాణుల వేటపై గతంలోనే సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతోచర్యలు మొదలయ్యాయి. అధికారుల బదిలీ,  చెక్‌పోస్టుల ఏర్పాటు వంటివి ప్రారంభించినా పురోగతి తక్కువగానే ఉంది.
* దీంతో డ్రోన్లు, ఇతరత్రా ఆధునిక పరిజ్ఞానంపై శాఖ చూపు సారించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
*డ్రోన్ల తయారీ నిపుణులతో అటవీశాఖ అదనపు పీసీసీఎఫ్‌ మునీంద్ర, ఇతర ఉన్నతాధికారులు ఇటీవలే హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సమావేశమయ్యారు.
*రకరకాల డ్రోన్లు, వాటి పనితీరు ‘ప్రజంటేషన్‌’ను నిపుణుల సమక్షంలో పరిశీలించారు.
*కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల అటవీ ప్రాంతాల్లో త్వరలోనే వాటిని పరీక్షించి చూస్తామని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు.

views: 808

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams