Current Affairs Telugu Daily

షార్‌కు చేరిన రీశాట్‌ ఉపగ్రహం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు మే 12 న  సాయంత్రం అత్యంత భద్రత నడుమ రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం ప్రత్యేక వాహనంలో చేరింది.
*దీనిని బెంగళూరులోని యూఆర్‌ రావు ఉపగ్రహ కేంద్రం నుంచిమే 11న  కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల బందోబస్తు మధ్య మే 12 న  షార్‌కు తీసుకొచ్చారు.
*ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌- సి 46 నాలుగో దశ వరకు అనుసంధానం చేసి, ఉపగ్రహం కోసం శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.
*మే 12 న షార్‌కు చేరుకున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని క్లీన్‌ రూమ్‌లో ఉంచారు.
* పీఎస్‌ఎల్‌వీ-సీ 46 వాహక నౌకతో అనుసంధానం చేయనున్నారు.
*పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని ఈనెల(మే) 22వ తేదీ ఉదయం 5.27 గంటలకు చేసేలా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
Satish Dhawan Space Centre::
  • Address: Sriharikota, Andhra Pradesh 524124
  • Website: shar.gov.in
  • Founded: 1971
  • Director: P. Kunhikrishnan

views: 879



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams