Current Affairs Telugu Daily

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మండల వ్యవస్థకు 32 ఏళ్లు
మండల వ్యవస్థ ఏర్పడి ఏళ్లు దాటింది.. 1987లో మొదటి సారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు.
*అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి.
*ఇందులో ప్రారంభంలో ఒకసారి ప్రత్యక్షంగా ఆ తర్వాత రెండో పర్యాయం నుంచి మండల, జిల్లా ప్రాదేశిక వ్యవస్థ ఆరంభమైంది. ఇలా మొత్తం  32 ఏళ్లలో ఐదు పర్యాయాలు ఎన్నికలు జరగగా ఇందులో ఏడేళ్లకు పైగా ప్రజాప్రతినిధుల పాలన సాగింది. 
*25 ఏళ్లు ఎంపీపీలు పాలన చేయగా ..ఏడేళ్ల పాటు ప్రత్యేక అధికారులే పాలన సాగించారు. *పదవీ కాలం పూర్తయినా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోగా మూడు పర్యాయాల పాటు ప్రత్యేక అధికారును నియమించారు.
*వ్యవస్థ ప్రారంభమైన తొలి మూడు నెలల పాటు 1987 జనవరి 15 నుంచి 1987 ఏప్రిల్‌ 23 వరకు ప్రత్యేక అధికారులను నియమించారు.
*మొదటిసారి ఎన్నికైన మండల పరిషత్‌ అధ్యక్షులు 1987 ఏప్రిల్‌ 24న బాధ్యతలు స్వీకరించి 1992 మే 19 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1992 మే 20 నుంచి 1995 మార్చి 17 మధ్య మూడేళ్ల పాటు, 2000 మార్చి 18 నుంచి 2001 జులై 21, చివరగా 2011 జులై 22 నుంచి 2014 జులై 3 వరకు మూడేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.

views: 1050

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams