Current Affairs Telugu Daily

50 లక్షల కిరాణా డిజిటలీకరణ
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇకామర్స్‌ రంగంలోకి ప్రవేశించడం వల్ల, 2023కు 50 లక్షల కిరాణా దుకాణాలు పూర్తిస్థాయి డిజిటలీకరణ చెందుతాయని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్లించ్‌ అంచనా వేస్తోంది.
*కోట్ల సంఖ్యలోని సంప్రదాయ దుకాణాలను అనుసంధానిస్తూ, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను రిలయన్స్‌ రూపొందిస్తుండటమే ఇందుకు కారణమని విశ్లేషించింది.
* దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలలో 10,000కు పైగా విక్రయశాలలు నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌, ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌’ ఇకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ నెలకొల్పనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.
*ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో మొబైల్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఎం పీఓఎస్‌) పరికరాలను ఆయా కిరాణా దుకాణాల్లో ఉంచి, 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానించనుంది.
*ఇందువల్ల వినియోగదార్లకే కాక, సరకుకు సులభంగా ఆర్డరు ఇవ్వడం, చెల్లింపులు జరపడం దుకాణదార్లకు వీలవుతుంది.
*ఎం పీఓఎస్‌ పరికరం, సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుతం స్నాప్‌బిజ్‌, నుక్కడ్‌షాప్స్‌, గోఫ్రుగల్‌ వంటి సంస్థలు రూ.15,000-1,00,000 స్థాయిలో అందిస్తుండగా, రిలయన్స్‌ జియో రూ.3,000కే అందించనుంది.
*దీంతోపాటు చెల్లింపులకు ఎటువంటి అదనపు ఛార్జీ కూడా వసూలు చేయరు. దీంతోపాటు రాయితీలు-ఆఫర్లు ఇచ్చేందుకు, వీటిపై కొనుగోలుదార్లకు సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌) ద్వారా సమాచారం ఇచ్చేందుకు కూడా వీలవుతుంది కనుక, దుకాణదారులు డిజిటలీకరణకు ముందుకు వస్తారని నివేదిక అంచనా వేస్తోంది.

views: 724Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams