Current Affairs Telugu Daily

నిర్భయ కేసు విచారణ అధికారిణికి అవార్డు
2012లో దిల్లీలో జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఘటన కేసుకు సంబంధించి విచారణ చేసిన ఐపీఎస్‌ అధికారిణి ఛాయా శర్మకు మెక్‌కెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అవార్డు వరించింది.
*మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అమెరికాకు చెందిన మెక్‌కెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏటా ఈ అవార్డు బహూకరిస్తూ వస్తోంది. ఛాయా శర్మ అమెరికాలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
*పోలీసు అధికారిణిగా ఛాయా శర్మ తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సున్నితమైన కేసులను పరిష్కరించారు. మానవ హక్కుల పరిరక్షకురాలిగానూ ఆమె బాగా గుర్తింపు పొందారు. క్రిమినల్‌ కేసుల విషయంలో ఈమె దర్యాప్తు ఎల్లప్పుడు బాధితుల కోణంలోనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళల కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారు. దర్యాప్తులో సాంకేతికపరమైన సాక్ష్యాలను సాధించడంలో ఛాయా శర్మ దిట్ట
*ఈ పురస్కారం 2015లో మలాలా యుసఫ్‌జైకు, 2016 డైకెంబే ముటాంబోకు వచ్చింది.

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams