Current Affairs Telugu Daily

అంతరిక్ష వాహక నౌక నమూనా అమెజాన్‌ ‘బ్లూ మూన్‌'ను ఆవిష్కరించిన అమెజాన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌
*చంద్రుడిపైకి మనుషులను, ఇతర వాహనాలు, పరికరాలను పంపే అంతరిక్ష వాహక నౌక నమూనాను అమెజాన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌ ఆవిష్కరించారు.
*ఇది చూడటానికి కాస్త టైమ్‌ మెషిన్‌లానే ఉన్నా దీని పేరు బ్లూ మూన్‌! దీనికి నాలుగు స్టాండ్లు.. మధ్యలో నైట్రోజన్‌ ఇంధన ట్యాంక్‌ ఉంటుంది.
*మానవరహిత, పునర్వినియోగ వాహనం ద్వారా 2024లోగా చంద్రుడిపైకి మనుషులతో పాటు సాంకేతిక పరికరాలను, ఉపగ్రహాలను, యంత్రాలను పంపించాలన్నది ‘బ్లూ మూన్‌’ ప్రాజెక్టు లక్ష్యం.
*అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. చంద్రుడిపైకి వెళ్లే ఈ వాహనం నాలుగు రోవర్లతో పాటు 3..6 టన్నుల బరువును మోయగలదని, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదని ఆయన వెల్లడించారు.
*భవిష్యత్తులో చంద్ర మండలంపైన మనుషులు నివాసం ఉంటారని, అందుకు అనుగుణంగా భూమి, చంద్రుడిపైకి ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.
*బెజో్‌సకు చెందిన ఏరోస్పేస్‌ సంస్థ బ్లూ ఆరిజన్‌ బ్లూ మూన్‌ను అభివృద్ధి చేసింది.

views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams