ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ 
ప్రపంచంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల బ్యాటరీ ఆస్ట్రేలియాలో ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ సంస్థ టెస్లాకు ఈ కాంట్రాక్టు దక్కింది. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఈ భారీ లిథియం-అయాన్‌ బ్యాటరీ ఏర్పాటవుతుంది. బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలను నిలిపివేసి, పవన, సౌర, గ్యాస్‌ వనరులపై ఆధారపడాలని ఈ రాష్ట్రం నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన నియోయెన్‌ సంస్థ నిర్మిస్తున్న పవన విద్యుత్‌ కేంద్రంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన 80 మెగావాట్ల లిథియం-అయాన్‌ బ్యాటరీ ప్రాజెక్టును అధిగమించి ఇది ప్రపంచంలోనే భారీ బ్యాటరీగా గుర్తింపు పొందనుంది.
views: 853

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams