Current Affairs Telugu Daily

భారత వాయుసేన లి అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌

* తొలి అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ను అమెరికా నేడు అధికారికంగా భారత వైమానికదళానికి అప్పగించింది.
*అరిజోనాలోని బోయింగ్‌ ఉత్పత్తి కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారత వైమానిక దళం తరఫున ఎయిర్‌ మార్షల్‌ ఏఎస్‌ బుటోలా తొలి అపాచీని స్వీకరించారు.
*యూఎస్‌ నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబరులో ఐఏఎఫ్‌.. అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది.
*ఈ ఏడాది జులై నాటికి తొలి విడత హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. ‘భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు రావడం ఐఏఎఫ్‌ హెలికాప్టర్ల ఆధునికీకరణలో కీలక ముందడుగు. వాయుసేన భవిష్యత్‌ అవసరాలకు ఈ హెలికాప్టర్‌ ఎంతో అనువైనది.’ అని ఐఏఎఫ్‌ ట్వీటర్‌లో పేర్కొంది.
*అపాచీ హెలికాప్టర్లకు గాలిలో, భూమి మీద దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది.


views: 848



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams