Current Affairs Telugu Daily

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ కన్నుమూత
*దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) మే 11న  ఉదయం కన్నుమూశారు. 
*వైసీడీగా ఆయన కార్పొరేట్‌ రంగానికి సుపరిచితులు.
*2011లో ఆయన పద్మభూషణ్‌ అవార్డును అందుకొన్నారు.
*ఐటీసీని ఒక ఎఫ్‌ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్‌కే దక్కుతుంది.
*భారతీయ కార్పొరేట్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక  దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్ది మందిలో దేవేశ్వర్‌ ఒకరు.
*2017 వరకు ఆయన ఐటీసీకి సీఈవోగా కూడా పనిచేశారు.
*2018 జనవరిలో ఐటీసీ ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. 
దేవేశ్వర్‌ 1968లో ఐటీసీలో చేరారు.
*ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరారు.
*ఆయన  నేతృత్వంలో కంపెనీ బాట్‌ నుంచి టేకోవర్‌ ముప్పును విజయవంతంగా తప్పించుకొంది.
*అనంతరం ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి దిగి విజయవంతంగా ముందుకు దూసుకెళ్లింది.
* దీంతో ఐటీసీ ఆదాయం రూ.5,200 కోట్ల నుంచి రూ.51,000 కోట్లకు చేరింది.
*దీంతో ఏటా ఐటీసీ వాటాదారులకు 23.3శాతం రాబడిని అందిస్తోంది. 

views: 795



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams