Current Affairs Telugu Daily

14 పేలోడ్స్‌ను మోసుకెళ్లనున్న చంద్రయాన్‌-2

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్‌-2కు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
*జులై 9 నుంచి 16 మధ్యలో చేపట్టనున్న ఈ ప్రయోగం ద్వారా.. మొత్తం భారత్‌కు చెందిన 14 పేలోడ్స్‌ను చంద్రునిపైకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది.

3,800 కేజీల బరువుండే వాహకనౌకలో ఒక ఆర్బిటర్‌, ఐదు కాళ్ల ల్యాండర్‌, రోబోటిక్‌ రోవర్‌ ఉండనున్నాయి.
*ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితలం నుంచి 100 కి.మీ దూరంలో తిరగనుండగా..
*‘విక్రమ్‌’గా నామకరణం చేసిన ల్యాండర్‌ సెప్టెంబర్‌ 6 నాటికి చంద్రునిపై కాలుమోపనుంది. *‘ప్రజ్ఞాన్‌’గా పిలిచే రోబోటిక్‌ రోవర్‌ చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయనుంది. 

*ఈ మూడు మాడ్యూళ్లు పేలోడ్స్‌ను మోసుకెళ్తాయని ఇస్రో తెలిపింది.
*ఆర్బిటర్‌ ఒక్కటే 8 పేలోడ్స్‌ను మోసుకెళ్లగా..
*ల్యాండర్‌ 4, రోవర్‌ రెండింటిని తీసుకెళ్లనుంది. అయితే ఇటీవల 13 పేలోడ్స్‌ అని చెప్పగా.. తాజాగా 14 పేలోడ్స్‌ను చంద్రయాన్‌-2 మోసుకెళ్లనుందని ఇస్రో వెల్లడించింది.
* చంద్రయాన్‌-1 విదేశాలకు చెందిన పేలోడ్స్‌ను కూడా మోసుకెళ్లగా.
* ఈ ప్రయోగం ద్వారా కేవలం భారత్‌కు చెందిన పేలోడ్స్‌నే తీసుకెళ్లనున్నారు.

ఈ మూడు మాడ్యూళ్లను శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ ఎం.కె-3 లాంచ్‌ వెహికల్‌తో ప్రయోగిస్తారు.
*చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించనున్నారు.
* ఈ ప్రయోగం విజయవంతమైతే తొలి ప్రయత్నంలోనే దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ప్రాజెక్టుగా చంద్రయాన్‌-2 నిలవనుంది.


views: 855



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams