Current Affairs Telugu Daily

15న ఐసీజీ నౌక ‘విగ్రహ’కు వీడ్కోలు
 *భారత తీర గస్తీదళ (ఐసీజీ) నౌక ‘విగ్రహ’కు ఈ నెల 15వ తేదీన సేవల నుంచి వీడ్కోలు పలకనున్నట్లు విశాఖపట్నంలోని కోస్టుగార్డు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
*ఈ నౌక 29 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలను అందించిందని పేర్కొన్నాయి.
*ముంబయి మజిగావ్‌ డాక్‌లో నిర్మించిన విగ్రహ నౌకను 1990 ఏప్రిల్‌ 12న జాతికి అంకితం చేసినట్టు వెల్లడించాయి.
*అయితే, 2008 ఆగస్టు 11 నుంచి 2011 జనవరి 22 వరకు దీన్ని శ్రీలంక నౌకాదళానికి లీజుకు ఇచ్చారు.
*లీజు పరిమితి ముగిశాక 2011 జనవరి 23వ తేదీన కేరళలోని కొచ్చి తీరంలో తిరిగి విధుల్లోకి ప్రవేశించిందని వివరించాయి.
*అదే ఏడాది మార్చి 15వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా తన సేవలను కొనసాగించింది. *విగ్రహ నౌక వీడ్కోలు కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పరమేష్‌, ఇతర కమాండింగ్‌ అధికారులు పాల్గొంటారని కోస్టుగార్డు వర్గాలు తెలిపాయి.

views: 791

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams