Current Affairs Telugu Daily

‘మిస్టర్‌ ఇండియా’గా సయ్యద్‌ జీన్‌
గార్డెన్‌సిటీ బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువ మోడల్‌ సయ్యద్‌ జీన్‌ ‘మిస్టర్‌ ఇండియా 2019’గా నిలిచాడు.
*ఈ టైటిల్‌తో మే 09 న  నగరానికి చేరుకున్న సయ్యద్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
*రూబరు గ్రూప్‌ సంస్థ ముంబైలో పురుషుల కోసం నిర్వహించిన 16వ ఎడిషన్‌ సౌందర్య పోటీలలో మొత్తం 38 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
*సయ్యద్‌ జీన్‌తోపాటు ఐదుగురే ఫైనల్స్‌కి చేరుకున్నారు.
*6 అడుగుల ఎత్తైన ఈ బెంగళూరు అందగాడు మిస్టర్‌ ఇండియా కిరీటంతోపాటు మిస్టర్‌ ఫొటోజెనిక్‌ టైటిల్‌ను కూడా సాధించాడు.
*బెంగళూరు ఆర్‌.టి.నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్నప్పటికీ మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
*మిస్టర్‌ సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ టైటిల్‌ లో  రన్నర్‌పగా నిలిచిన అతను ఇప్పుడు మిస్టర్‌ ఇండియా కిరీటంతో సత్తా చాటాడు.

views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams