Current Affairs Telugu Daily

జీఎస్టీలో ఆంధ్రప్రదేశ్‌ మేటి :  2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,746 కోట్ల వసూళ్లు
వస్తు సేవల పన్ను వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్లింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2018-19లో రెండింతల పన్ను అధికంగా వసూలైంది.
* తొలిఏడాదిలో 9 నెలల కాలానికి(జీఎస్‌టీ జులై, 2017 అమల్లోకి వచ్చింది) రూ.10,826.28కోట్లు సాధించగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా రూ.20,746.12కోట్లకు చేరింది. అంతక్రితంతో పోలిస్తే 27.75% అదనమిది.
* ఈ విధానం కొత్త కావడంవల్ల తొలి ఏడాదిలో మాత్రం కేంద్రం నుంచి నష్టపరిహారం కింద రూ.386 కోట్లు రాష్ట్రానికి అందాయి.
*2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ అవసరం లేకుండా పోయింది.
*నష్టపరిహారం అవసరం లేని చిన్నరాష్ట్రాలైన మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, నాగాలాండ్‌, సిక్కిం రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించింది.
*తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా తదితర రాష్ట్రాలు కేంద్రం నుంచి ఇంకా నష్టపరిహారం అందుకుంటున్నాయి.
*జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం అందిస్తుంది.

views: 1056



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams