Current Affairs Telugu Daily

అయోధ్య భూవివాదం కేసులో త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదిక
వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య మధ్యవర్తిత్వం కమిటీ తన మధ్యంతర నివేదికను సమర్పించింది.
*అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీకి మే 6న సమర్పించిందని, శుక్రవారం తొలిసారి ధర్మాసనం విచారించనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
*సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. *సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.కలీఫుల్లా, ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీరవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ అడ్వొకేట్‌ శ్రీరామ్‌పంచు ఈ కమిటీలో సభ్యులు.

views: 808



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams