Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో డేటా చౌర్య నిరోధక కేంద్రం 
సైబర్‌ నేరాలు, మోసాల నియంత్రణకు, డేటా చౌర్యాన్ని నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ సైబర్‌ క్లస్టర్‌లు సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. *ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హేగ్‌లో మాత్రమే ఇలాంటి కేంద్రం ఉంది.
*ఐటీ పరిజ్ఞానంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలకు కొత్తగా ప్రారంభమయ్యే కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
*ఈ ఒప్పందంలో భాగంగా అన్నిరాష్ట్రాలు సైబర్‌ క్లస్టర్లను ప్రారంభించి తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర సంస్థలకు సైబర్‌ భద్రత కల్పించాలని చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీలో మాత్రమే సైబర్‌ క్లస్టర్లు మొదలయ్యాయని తెలిపారు.
*రెండోదశలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, పరిశోధక సంస్థలు, విద్యార్థులను భాగస్వాములను చేసుకోనున్నామని తెలిపారు. రెండో దశపూర్తయ్యాక డేటా చౌర్యాన్ని నిరోధించే కేంద్రం పనిచేయడం మొదలవుతుందని చెప్పారు.

views: 817

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams