Current Affairs Telugu Daily

మే 22న పీఎస్‌ఎల్‌వీ-సి 46 ప్రయోగం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 22(మే)వ తేదీన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌- సి 46 వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు.
*ఉపగ్రహం బెంగళూరు నుంచి రావాల్సి ఉంది. పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక రీశాట్‌-2 బీఆర్‌ 1 రాడార్‌ ఇమేజింగ్‌ ఉప్రగహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
*ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సింథటిక్‌ ఎపర్చరు రాడార్ల(ఎస్‌ఏఆర్‌)ను ఉపయోగించి సమాచారాన్ని అందించనుంది.
*2009 ఏప్రిల్‌ 20న మొదటగా రీశాట్‌ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపింది. అప్పట్లో వాతావరణ పరిస్థితులు, సరిహద్దుల్లో చొరబాటుదారులను గుర్తించడంతోపాటు, రాత్రి వేళల్లో కూడా నిర్దుష్ట సమాచారం అందించేందుకు వీలుగా వాటి రూపకల్పన జరిగింది.
*రీశాట్‌ రెండో ఉపగ్రహాన్ని 2012 ఏప్రిల్‌ 26న కక్ష్యలో ప్రవేశపెట్టారు. రీశాట్‌-2 బీఆర్‌ 1 ఆకృతి గతంలో ఇస్రో పంపిన రీశాట్‌ ఉప్రగహాలకు భిన్నంగా ఉంటుంది.

views: 820

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams