Current Affairs Telugu Daily

నేడు భారత్‌-చైనా వాణిజ్య చర్చలు 
వాణిజ్య అంశాలపై చర్చించేందుకు భారత్‌-చైనా ఉన్నతాధికారులుమే may 09 న  ఢిల్లీలో భేటీ అవుతున్నారు.
* చైనాకు భారత వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
*చైనా ప్రతినిధి వర్గానికి ఆ దేశ సాధారణ పరిపాలన, కస్టమ్స్‌ (జీఏసీసీ) శాఖల ఉప మంత్రి లి గువో నాయకత్వం వహిస్తున్నారు.
*భారత్‌ తరఫున వాణిజ్య, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, అపెడా ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొంటున్నారు.
*గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్య కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాకు 5,012 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.5 లక్షల కోట్లు) మిగులు తేలింది.

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams