Current Affairs Telugu Daily

సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందికి భారీగా భత్యాల పెంపు 
సియాచిన్‌, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులు, భద్రత బలగాల సభ్యులకు చెల్లించే సమస్యాత్మక ప్రాంత భత్యాలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఏడో వేతన సంఘం సిఫార్సుకు చిన్నపాటి మార్పుతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో సేవలు అందించే జవాన్లకు సమస్యాత్మక ప్రాంత భత్యాన్ని నెలకు రూ.14 వేల నుంచి రూ.30 వేలకు ప్రభుత్వం పెంచింది. అధికారులకు ఈ భత్యాన్ని రూ.21వేల నుంచి రూ.42,500కు పెంచింది. 
views: 934

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams