Current Affairs Telugu Daily

కనీస ఆదాయ పథకాలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది: ఆర్‌బీఐ
కనీస ఆదాయ పథకాలు, రైతు రుణ మాఫీల వంటి ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది.
*ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన 15వ ఆర్థిక కమిషన్‌, ఆర్‌బీఐ సభ్యుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
*ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, డిప్యూటీ గవర్నర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*విద్యుత్‌ రంగంలో వచ్చిన ఉదయ్‌ బాండ్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిని దిగజారేలా చేశాయని ఆర్‌బీఐ గుర్తుచేసింది.
*సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి వరుస సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి.
* రాష్ట్రాల పరిస్థితి దిగజారితే.. ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందరు ఆర్‌బీఐ గవర్నర్లు అభిప్రాయపడ్డారు

views: 704

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams