Current Affairs Telugu Daily

రెండు ఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
*ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు బిల్లు 2018, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఏపీ సవరణ)బిల్లు 2018లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.
*ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎం.విజయరాజుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రథమ కార్యదర్శి లేఖ రాశారు.
*కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను  ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ మీడియాకు విడుదల చేశారు. 
 *రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల పునరుద్ధరణకు కేంద్రం వాటా తొలి విడతగా రూ.69.84కోట్లు విడుదల చేసినట్లు ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు.
*ఈ పథకంలో రాష్ట్రానికి రూ.100.42 కోట్లు మంజూరు కాగా రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది.

views: 726

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams