Current Affairs Telugu Daily

చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం
అక్షయ తృతీయను పురస్కరించుకుని ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి, గంగోత్రి దేవాలయాలను తెరిచారు. 
* ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. 
*దీనికి ముందు గంగా, యమునల విగ్రహాలను శీతాకాల విడిది అయిన ముఖ్బా, ఖర్సాలీ నుంచి తీసుకొచ్చారు.
*దీంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లతో కూడిన చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది.
*మే 9న  కేదార్‌నాథ్‌ ఆలయాన్ని, తర్వాత రోజున బద్రీనాథ్‌ ఆలయాన్ని తెరుస్తారు.
*విపరీతంగా మంచు కురుస్తుందని ఈ నాలుగు ఆలయాలను ఏటా అక్టోబర్‌ -నవంబర్‌ నెలల్లో మూసివేసి ఏప్రిల్‌- మే నెలల్లో తెరుస్తారు.

views: 817



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams