Current Affairs Telugu Daily

మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ పోటీలో రన్నరప్‌గా భారత్
మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఇమేజిన్‌ కప్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’లో భారత్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండో స్థానంలో (ఫస్ట్‌ రన్నరప్‌గా) నిలిచారు.
*వీరు స్మార్ట్‌ ఆటోమేటెడ్‌ కాలుష్య నిరోధక, ఔషధ బట్వాడా మాస్క్‌ను తయారుచేశారు. ఇలాంటి సాధనాన్ని రూపొందించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఆకాశ్‌, వాసు కౌశిక్‌, భరత్‌ సుందల్‌లు ఈ ఘనత సాధించారు. *ఆస్థమా, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న రోగులకు ఉపయోగపడే ‘సేలి’ అనే సాధనాన్ని వీరు రూపొందించారు.  ఫిబ్రవరిలో సిడ్నీలో జరిగి ఆసియా ప్రాంతీయ తుది పోటీలో ఇది మొదటి స్థానంలో నిలిచింది.
*మొదటి బహుమతిని అమెరికాకు చెందిన ‘టీమ్‌ ఈజీగ్లూకోజ్‌’ గెల్చుకుంది. ఈ బృందానికి లక్ష డాలర్ల బహుమతి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల నుంచి మార్గనిర్దేశ ఉపన్యాసం లభిస్తుంది.
*ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన భారత బృందానికి సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌లు, 40వేల డాలర్లు దక్కుతాయి.
Microsoft Corporation:
  • CEO: Satya Nadella 
  • Headquarters: Redmond, Washington, United States
  • Founders: Bill Gates, Paul Allen

views: 758



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams