Current Affairs Telugu Daily

చైనా వస్తువులపై 25 శాతం పన్ను విధిచనున్న అమెరికా 
 దాదాపు 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.
*ఈ కొత్త సుంకాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.
*గత 10 నెలల నుంచి 50 బిలియన్‌ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని అమెరికాకు చైనా చెల్లిస్తోంది.
* ట్రంప్‌ తాజా నిర్ణయంతో ఇతర ఉత్పత్తులపై చైనా చెల్లిస్తున్న 10 శాతం పన్ను.. ఇక నుంచి  25 శాతానికి చేరనుంది. చైనా, అమెరికాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు  గత ఏడాది నవంబర్‌లో జరిగిన జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు నిర్ణయానికి వచ్చారు.
*100 రోజులు ఇరు దేశాల సుంకాలు పెంచకూడదని నిర్ణయించాయి.

views: 789

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams