Current Affairs Telugu Daily

గుజరాత్‌ రైతులపై కేసును వెనక్కి తీసుకున్న పెప్సికో
గుజరాత్‌లోని బంగాళా దుంపల రైతులపై నమోదు చేసిన మూడు కేసుల్లో ఒక దానిని పెప్సికో ఇండియా  ఉపసంహరించుకొంది. బనస్కంత జిల్లా దీసా పట్టణంలోని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌, కమర్షియల్‌ కోర్టు జడ్జి ఎస్‌.బి.రహత్కర్‌కు ఈ మేరకు కంపెనీ విన్నవించింది. రైతులపై వివిధ కోర్టుల్లో మోపిన కేసులను వెనక్కి తీసుకుంటామని గత వారం రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీ హామీ ఇచ్చింది.

*‘లేస్‌’ చిప్స్‌ కోసం తాము ప్రత్యేకంగా పేటెంటు పొందిన ఎఫ్‌సి-5 అనే రకం బంగాళాదుంపలను గుజరాత్‌ రైతులు పండిస్తున్నారంటూ వారిపై ఏప్రిల్‌లో పెప్సికో కేసులు పెట్టింది. 

ఏమిటీ ఎఫ్‌సి-5 వివాదం?
ఎఫ్‌సి-5 అనేది బంగాళాదుంపలలో ఒక రకం. ఈ రకం విత్తనాల ద్వారా పండిన బంగాళాదుంపలలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల చిప్స్‌ తయారు చేసేటపుడు ఇవీ నూనెను ఎక్కువగా పీల్చుకోవు. దీంతో ఈ రకం బంగాళాదుంపలపై పెప్సికో పేటెంటు హక్కులు తీసుకుంది


views: 696

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams