Current Affairs Telugu Daily

మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియాగా అక్షర రెడ్డి
మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియా-2019 అందాల పోటీల్లో తెలుగమ్మాయి అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 240 మందికిపైగా అందాలతారలు పోటీపడగా, కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జరిగిన ఫైనల్స్‌లో అక్షర కిరీటాన్ని దక్కించుకున్నారు.

*దీంతో వచ్చే అక్టోబర్‌లో దుబాయ్‌లో జరుగనున్న మిస్‌ సూపర్‌గ్లోబ్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ 45 దేశాలకు చెందిన అందాలభామలతో అక్షర పోటీపడతారు.

*అక్షరరెడ్డిది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. సుధాకర్‌, గౌరి తల్లిదండ్రులు. 2011లో మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నారు. 2016లో మిస్‌ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు.

views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams