126 గంటల పాటు ఆగకుండా డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
126 గంటల పాటు ఆగకుండా డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది 18 ఏండ్ల నేపాలీ బాలిక బంధనా నేపాల్. తూర్పు నేపాల్లోని ధన్కుటా జిల్లాకు చెందిన బంధనా వ్యక్తిగత విభాగంలో సుదీర్ఘ నృత్య మారథాన్లో ఈ ఘనత సాధించింది.
*బంధనా కంటే ముందు ఈ రికార్డు భారతీయ బాలిక హేమలత పేరిట ఉండేది. 2011లో 123 గంటల 15 నిమిషాల పాటు హేమలత నృత్యం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
views: 898