Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 లెదర్‌ పార్కులు

రాష్ట్రంలో తోళ్ల పరిశ్రమ అభివృద్ధి, ఆ రంగంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా ‘మినీ లెదర్‌ పార్కులు’ ఏర్పాటు కానున్నాయి.
*8 జిల్లాల్లో 11 లెదర్‌ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోలు, వాటి అనుబంధ తయారీ పరిశ్రమలు స్థాపించేలా మౌలిక వసతుల కల్పన, ఉత్పత్తుల విక్రయానికి వీలుగా దుకాణాలు, సంప్రదాయ చర్మకారులకు నైపుణ్య శిక్షణిచ్చే కేంద్రాలు ఈ పార్కుల్లో ఉంటాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయనుంది.
*మొత్తం 208.91 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న లెదర్‌ పార్కుల ద్వారా దాదాపు 270 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పార్కుల్లో ఉండేవి...
* సంప్రదాయ చర్మకారులకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం
* దేశీయ, విదేశీ బ్రాండ్లతో కూడిన షోరూంలు
* కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ కేంద్రం
* తోళ్ల ప్రాసెసింగ్‌ యూనిట్‌
* చెప్పులు, బూట్లు తదితర ఉత్పత్తుల కేంద్రాలు
* జీరో డిశ్చార్జ్‌ ట్యానరీ(తోళ్ల శుద్ధిలో వెలువడే వ్యర్థాల్ని పూర్తిస్థాయిలో నాశనం చేసే వ్యవస్థ)


views: 1037

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams