Current Affairs Telugu Daily

 బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఉత్తమ ఈ-గవర్నెన్స్‌ అవార్డు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఉత్తమ ఈ-గవర్నెన్స్‌ అవార్డు దక్కింది. ఏటా జాతీయస్థాయిలో అవార్డులు ఇస్తున్న కంప్యూటర్‌ సైన్స్‌ ఆఫ్‌ ఇండియా(సీఎస్‌ఐ)- నిహిలెంట్‌ సంస్థ 2017-18 సంవత్సరానికిగాను ప్రాజెక్టు కేటగిరీ కింద కార్పొరేషన్‌కు ఈ అవార్డు అందజేసింది.
*బ్రాహ్మణ కార్పొరేషన్‌లో అన్ని పథకాలకు ఆన్‌లైన్‌ విధానమే అమలుచేస్తున్నారు. 2015లో కార్పొరేషన్‌ ఏర్పాటైనప్పటి నుంచీ ఆన్‌లైన్‌ ఆధారితంగానే పథకాలు అమలు జరుగుతున్నాయి.
 *దీనివల్ల పారదర్శకంగా లబ్ధిదారులకు పథకాలు అందాయని గుర్తించి ‘ది అవార్డ్‌ ఆఫ్‌ రికగ్నేషన్‌’ అవార్డును ఇచ్చారు.
*కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య, ఎండీ పద్మలు సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. 

views: 932Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams